SBI ఆశా స్కాలర్షిప్ 2025: ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ₹20 లక్షల వరకు ఆర్థిక సాయం అవకాశం | SBI Asha Scholarship 2025
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ పేదింటి ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం ప్లాటినమ్ జూబ్లీ ఆశా స్కాలర్షిప్ 2025ను ప్రకటించింది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 23,230 మంది విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించనున్నారు. దీని కోసం ₹90 కోట్ల నిధులు కేటాయించారు.
2022 నుండి ఆశా స్కాలర్షిప్ పథకం ద్వారా వెనుకబడిన విద్యార్థులకు ఎస్బీఐ సహాయం అందిస్తోంది. ఈ ఏడాదికీ నోటిఫికేషన్ విడుదలచేసి, అర్హులైన వారికి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
9వ తరగతి నుండి పోస్టు గ్రాడ్యుయేషన్ వరకు చదువుతున్న పేద విద్యార్థులు ఈ స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవచ్చు. 2024-25 విద్యా సంవత్సరంలో కనీసం 75% మార్కులు లేదా 7 సీజీపీఏ సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 67.5% మార్కులు లేదా 6.3 సీజీపీఏ సరిపోతుంది. విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం ₹3 లక్షల నుండి ₹6 లక్షల మధ్య ఉండాలి.
దరఖాస్తుల చివరి తేదీ నవంబర్ 15, 2025. ఎంపికైన వారికి ₹15,000 నుండి ₹20 లక్షల వరకు ఆర్థిక సహాయం అందుతుంది. ప్రతి సంవత్సరం రిన్యువల్ కోసం అర్హత ప్రమాణాలను, అటెండెన్స్, ఉత్తీర్ణత మార్కులను పాటించాలి.
ఈ స్కాలర్షిప్తో విద్యార్థులు తమ చదువు పూర్తి అయ్యే వరకు ఆర్థిక సహాయం పొందుతారు. దీని వల్ల ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉన్నత విద్య కొనసాగించగలరు. మరిన్ని వివరాల కోసం అధికారిక SBI Foundation వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు.













