లడో లక్ష్మీ యోజన: మహిళల ఖాతాల్లో నెలకు రూ.2,100 జమ.. అర్హతలు, అప్లికేషన్ వివరాలు | Lado Lakshmi Yojana
కేంద్ర ప్రభుత్వం మహిళలకు ఆర్థిక సహాయం అందించడానికి లడో దీన్ దయాళ్ లక్ష్మీ యోజనను ప్రారంభించింది. ఈ పథకం కింద అర్హత కలిగిన ప్రతి మహిళ ఖాతాలో నెలకు రూ.2,100 డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా జమ కానుంది.
ఈ పథకం ప్రస్తుతం హరియాణ రాష్ట్ర మహిళలకు వర్తిస్తోంది. దరఖాస్తు చేసుకునే మహిళ హరియాణ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి. వయస్సు 23 నుండి 60 సంవత్సరాల మధ్య ఉండాలి. కుటుంబ ఆదాయం రూ.1 లక్షలోపు ఉండాలి. అలాగే మహిళ లేదా ఆమె భర్త కనీసం 15 ఏళ్లు హరియాణలో నివసించి ఉండాలి.
దరఖాస్తు చేసుకోవడానికి లడో లక్ష్మీ యోజన మొబైల్ యాప్ అందుబాటులో ఉంది. అందులో మొబైల్ నంబర్ OTP వెరిఫై చేసి, వ్యక్తిగత వివరాలు, కుటుంబ సమాచారం, బ్యాంక్ ఖాతా నంబర్ నమోదు చేయాలి. యాప్‌లోనే మొబైల్ కెమెరా ద్వారా ఫోటో తీసి అప్లోడ్ చేయాలి. అప్లికేషన్ సబ్మిట్ చేసిన వెంటనే రిజిస్ట్రేషన్ మెసేజ్ వస్తుంది.
ఈ విధంగా అర్హత కలిగిన మహిళలు ప్రతి నెల రూ.2,100 ఆర్థిక సహాయం పొందవచ్చు.










