WhatsApp Group
Join Now
ఏపీ వాహనమిత్ర స్కీమ్ 2025: మీ అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకోండి | Ap Vahanamitra Status 2025
ఆంధ్రప్రదేశ్‌లో ఆటో, టాక్సీ డ్రైవర్ల కోసం ప్రభుత్వం వాహనమిత్ర స్కీమ్‌ను అమలు చేస్తోంది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి డ్రైవర్‌కు సంవత్సరానికి రూ.15,000 ఆర్థిక సహాయం అందజేస్తారు. ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ పూర్తయింది, అక్టోబర్ 1న అర్హుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. మీ దరఖాస్తు స్టేటస్ చెక్ చేసుకోవడం ఇలా–
స్కీమ్ ముఖ్య వివరాలు
- వాహనమిత్ర పథకానికి సెప్టెంబర్ 17 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది.
- సెప్టెంబర్ 20తో అప్లికేషన్ల గడువు ముగిసింది.
- సెప్టెంబర్ 22 నాటికి సచివాలయం, మండల, జిల్లా స్థాయిలో పరిశీలన పూర్తవుతుంది.
- సెప్టెంబర్ 24న తుది లబ్ధిదారుల జాబితా విడుదల అవుతుంది.
- అక్టోబర్ 1న సీఎం చంద్రబాబు నాయుడు ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు.
మీ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేయడం ఇలా
- GSWS NBM ( https://gsws-nbm.ap.gov.in/NBM/Home/Main ) వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
- హోమ్‌పేజీలో “Application Status” ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- సంవత్సరం 2025-26 ఎంపిక చేసుకోండి.
- మీ ఆధార్ నంబర్ నమోదు చేసి, క్యాప్చా ఎంటర్ చేయండి.
- Get OTP పై క్లిక్ చేసి, వచ్చిన OTPని ఎంటర్ చేయండి.
- స్క్రీన్‌పై మీ ప్రాథమిక వివరాలు, దరఖాస్తు స్టేటస్, రిమార్కులు కనిపిస్తాయి.
- రిమార్క్ సెక్షన్‌లో సమస్యలు లేకుంటే మీ ఖాతాలో నిధులు జమవుతాయి.
- ఏవైనా సమస్యలు ఉంటే, మీ దరఖాస్తు వివరాలు సరిచూడాలి.
ఈ విధంగా సులభంగా మీ వాహనమిత్ర అప్లికేషన్ స్టేటస్‌ను చెక్ చేసుకోవచ్చు. దీపావళి పండుగకు ముందు ఆటో, క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లో ఆర్థిక సాయం చేరుతుంది.
WhatsApp Group
Join Now








