AP EAPCET 2025 మూడో విడత కౌన్సెలింగ్ – రిజిస్ట్రేషన్, సీట్ల కేటాయింపు తేదీలు | AP EAPCET 2025 3rd Phase Counselling
ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు మరో అవకాశం కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యాశాఖ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈఏపీసెట్ (EAPCET) మూడో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది.
విద్యార్థులు సెప్టెంబర్ 11వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్ల ఎంపికకు 12 వరకు గడువు ఉంది. 13న ఆప్షన్లలో మార్పులు చేయడానికి అవకాశం కల్పించారు. అనంతరం 15న సీట్ల కేటాయింపు జరగనుంది. సీట్లు పొందిన వారు 15 నుంచి 17 మధ్య సంబంధిత కళాశాలల్లో రిపోర్ట్ చేయాలి. అదే రోజు నుంచి తరగతులు కూడా ప్రారంభమవుతాయి. ఇది తుది విడత కౌన్సెలింగ్ అని సాంకేతిక విద్యాశాఖ స్పష్టం చేసింది.
ఇక ఫార్మసీ కోర్సుల్లో బైపీసీ స్ట్రీమ్ విద్యార్థుల కోసం వేర్వేరు షెడ్యూల్ విడుదల చేశారు. తొలి విడతలో 11 నుంచి 16 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 13 నుంచి 18 వరకు వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకోవచ్చు. 19న ఆప్షన్లు మార్చుకోవడానికి అవకాశం కల్పించారు. 21న సీట్ల కేటాయింపు జరుగుతుంది. సీట్లు వచ్చిన విద్యార్థులు 21 నుంచి 23 వరకు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి. అదే తేదీ నుంచి క్లాసులు మొదలవుతాయి.
ఫార్మసీ తుది విడత రిజిస్ట్రేషన్ మాత్రం సెప్టెంబర్ 24, 25 తేదీల్లో జరగనుంది.