PAN Card Reprint: పాన్ కార్డు పోయిందా? ఇప్పుడు కేవలం రూ.50కే కొత్త కార్డు ఇంటికే డెలివరీ
పాన్ కార్డు మన ఆర్థిక గుర్తింపు కార్డు. బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయడం, ITR ఫైల్ చేయడం, ప్రాపర్టీ కొనుగోలు, వాహనాల రిజిస్ట్రేషన్, క్రెడిట్ కార్డు పొందడం వంటి అనేక ఆర్థిక లావాదేవీల్లో ఇది తప్పనిసరి. అయితే కొన్నిసార్లు పాన్ కార్డు పోగొట్టుకోవడం లేదా ఎక్కడైనా మర్చిపోవడం సాధారణమే. అలాంటి సమయంలో టెన్షన్ పడాల్సిన పనిలేదు. ఇప్పుడు కేవలం రూ.50 ఫీజు చెల్లించి ఆన్లైన్లో కొత్త పాన్ కార్డు రీప్రింట్ చేయించుకోవచ్చు.
ముందుగా పాన్ కార్డు పోయినట్లయితే దగ్గరలోని పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం మంచిది. దీని వల్ల మీ పాన్ కార్డు ఎవరైనా దుర్వినియోగం చేసే ప్రమాదం ఉండదు.
కొత్త పాన్ కార్డు పొందడానికి ప్రోటియన్ (మునుపటి NSDL) అధికారిక వెబ్సైట్ (👉 PAN Reprint Link) లోకి వెళ్లి రీప్రింట్ పాన్ కార్డు లింక్‌పై క్లిక్ చేయాలి. తర్వాత మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేయాలి. ఇన్‌స్ట్రక్షన్లకు అంగీకరించి క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.
తరువాత మీ చిరునామా, పిన్‌కోడ్ ధృవీకరించాక మొబైల్‌కి వచ్చిన OTPతో వేరిఫై చేయాలి. అనంతరం రూ.50 ఆన్లైన్ పేమెంట్ చేయాలి. చెల్లింపు పూర్తి చేసిన వెంటనే మీకు ట్రాకింగ్ నంబర్‌తో కూడిన రసీదు వస్తుంది. కొద్ది రోజుల్లో కొత్త పాన్ కార్డు మీ ఇంటికే డెలివరీ అవుతుంది.
🔹 ఇండియాలో రీప్రింట్ ఫీజు రూ.50 మాత్రమే.
🔹 విదేశాల్లో అడ్రస్ ఉంటే రూ.959 (GST సహా) చెల్లించాలి.
🔹 పాన్ కార్డు ఎప్పుడూ Income Tax records లో ఉన్న తాజా అడ్రస్‌కే వస్తుంది. అడ్రస్ మార్చాలంటే వేరుగా అప్డేట్ చేయాలి.
అందువల్ల పాన్ కార్డు పోయినా ఆందోళన అవసరం లేదు. కేవలం రూ.50తో సులభమైన ఆన్లైన్ ప్రాసెస్ ద్వారా కొత్త పాన్ కార్డు ఇంటికే వచ్చేస్తుంది.







