ప్రతీ నెల రూ.3000 పెన్షన్.. అసంఘటిత రంగ కార్మికుల కోసం కేంద్రం బంపర్ పథకం! – PM Shram Yogi Mandhan Yojana 2025
కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల భవిష్యత్తు కోసం ప్రత్యేక పథకాలను అమలు చేస్తోంది. అసంఘటిత రంగ కార్మికుల కోసం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్‌ధన్ యోజన పథకం ద్వారా వారికి 60 ఏళ్లు పూర్తైన తర్వాత నెలకు రూ.3000 పెన్షన్ లభిస్తుంది. ఈ పథకంలో వాచ్మెన్‌లు, ఆటో డ్రైవర్‌లు, మెకానిక్‌లు, చెప్పులు కుట్టేవారు, చేనేత కార్మికులు వంటి అసంఘటిత రంగంలో పనిచేసే వారు లబ్ధిదారులు అవుతారు.
18 నుండి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు ఈ పథకానికి అర్హులు. నెలకు కేవలం రూ.55 నుంచి రూ.200 వరకు కాంట్రిబ్యూషన్ చేస్తే సరిపోతుంది. 60 ఏళ్లు నిండిన తర్వాత ప్రతినెలా రూ.3000 పెన్షన్ రూపంలో ప్రభుత్వం భరోసా ఇస్తుంది.
ఈ స్కీమ్‌లో సభ్యత్వం పొందేందుకు అభ్యర్థి నెలవారీ ఆదాయం రూ.15,000 కంటే తక్కువగా ఉండాలి. EPF లేదా ESIC సభ్యులు కాకూడదు. ఒకవేళ పెన్షన్ పొందుతున్న వ్యక్తి మరణిస్తే, అతని జీవిత భాగస్వామికి పెన్షన్‌లో 50% లభిస్తుంది.
ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డు, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్, ఆటో డెబిట్ అనుమతి పత్రం అవసరం. అధికారిక వెబ్‌సైట్ labour.gov.in/pm-sym లో లాగిన్ అయి వివరాలు నమోదు చేసి నమోదు చేసుకోవచ్చు. ఆపై ప్రతినెల బ్యాంక్ ద్వారా ప్రీమియం డెడక్ట్ అవుతుంది.
ఇలా 60 ఏళ్లు పూర్తయ్యాక ప్రతినెల రూ.3000 పెన్షన్ అందించడం ద్వారా పేద ప్రజల భవిష్యత్తుకు ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది.










