AP e Crop 2025: రేపే చివరి రోజు.. పంట నమోదు చేయకపోతే సబ్సిడీలు, డబ్బులు రావు! |
అన్నదాత సుఖీభవ పథకం
ఆంధ్రప్రదేశ్ రైతులకు అత్యవసర హెచ్చరిక. సెప్టెంబర్ 30వ తేదీ (రేపు) ఈ-క్రాప్ బుకింగ్‌కు చివరి రోజు. కేవలం ఒకరోజు మాత్రమే మిగిలి ఉండటంతో రైతులు తక్షణమే తమ పంటలను నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆలస్యం చేస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల ప్రయోజనాలు అందకపోవచ్చు.
మన దేశం వ్యవసాయాధారిత దేశం. రైతుల కోసం పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ, వాతావరణ బీమా, పీఎం పంట బీమా వంటి పథకాలు అమలులో ఉన్నాయి. కానీ వీటన్నింటి లబ్ధి పొందాలంటే ఈ-క్రాప్ నమోదు తప్పనిసరి.
👉 రైతులు తమ పంట వివరాలు, ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ తప్పనిసరిగా నమోదు చేయాలి.
👉 వ్యవసాయ పంటలకు మండల వ్యవసాయ అధికారి, ఉద్యాన పంటలకు హార్టికల్చర్ అధికారి, ప్రభుత్వ భూముల పరిశీలనకు తహసీల్దార్ బాధ్యత వహిస్తారు.
👉 ఈ-క్రాప్ కేవైసీ పూర్తి చేయడమూ అవసరం.
భారీ వర్షాలు, వర్షాభావం, తుపానులు వంటి పరిస్థితుల్లో పంట నష్టపోయినప్పుడు రైతులకు ప్రభుత్వం బీమా సాయం అందిస్తుంది. కానీ ఈ సాయం పొందాలంటే పంట వివరాలు ముందుగానే ఈ-క్రాప్‌లో ఉండాలి.
కాబట్టి రైతులు రేపటిలోపు (సెప్టెంబర్ 30) తప్పకుండా తమ పంట వివరాలను నమోదు చేసుకోవాలి. లేకపోతే సబ్సిడీలు, పెట్టుబడి సాయం, బీమా వంటి ప్రయోజనాలు అందకపోవచ్చు.








